ఇంజక్షన్ వికటించి వ్యక్తి మృతి

  • డాక్టరు.. నర్సూ పరారీ
  • ఇదీ నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి కథ
  • ఆందోళనలో మృతుని కుటుంబం


(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : ఉన్న నాలుకకు మందు వెస్తే కొండ నాలుక ఊడిపోయిందన్న సామెత ప్రకారం కాలుకు దెబ్బ తగిలిందని సర్కారు ఆసుపత్రికి వెళ్తే ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. నంద్యాల ప్రభుత్వాసుపత్రి (Nandyal Government Hospital) లో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం ఎస్.చెన్నంపల్లి గ్రామం నివాసి జంగం రమణ (42) కాలికి దెబ్బ తగలడంతో ఐదు రోజుల కిందట ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స కోసం వచ్చారు. ఆసుపత్రిలో ఐదు రోజుల నుంచి చికిత్స నిర్వహిస్తున్నారు.

సోమవారం ఆపరేషన్ చేయాలని డాక్టర్లు (Doctors) నిర్ణయించారు. ఆపరేషన్ చికిత్సకు ముందు ఓ నర్సు ఇంజక్షన్ ఇచ్చింది. ఆ ఇంజక్షన్ వికటించి జంగం రమణ అక్కడికక్కడే చనిపోయాడు. డాక్టర్లు ఆ వార్డులో అందరూ ఎస్కేప్ అయిపోయారు. గంట, రెండు, మూడు, నాలుగు, ఐదు గంటల సమయం గడిచినప్పటికీ స్ట్రచ్చర్ మీదే శవం అలాగే ఉంది. హాస్పిటల్స్ సూపరింటెండెంట్ (Superintendent) బాధితులను కలసి డాక్డర్ తో ఈ సమస్యపై చర్చిస్తున్నామన్నారు. దీంతో భార్య లక్ష్మి, తల్లిదండ్రులు బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోనే రోగుల ప్రాణాలకు భద్రత లేకపోతే ఎలా అంటూ బాధితులు ప్రశ్నించారు. ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. హాస్పిటల్స్ సూపరింటెండెంట్ తో వాగ్వాదానికి దిగారు. రోగికి నర్సు కాలం చెల్లిన ఇంజెక్షన్ వేసిందా అని బంధువులు అనుమానిస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital) లో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వైద్యులు స్థానికంగా నివాసం ఉండటం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం ఓపి చూడాల్సిన డాక్టర్ సమయానికి కూడా ఉండటం లేదు. రోగికినాడి పట్టి చూసి డాక్టర్ ఏ లేకపోవటం విశేషం. సుదూర ప్రాంతాలు కర్నూలు నుంచి రోజు డాక్టర్లు వచ్చి పోతున్నారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జంగం రమణ మృతి పై సూపరింటెండెంట్ వివరణ అడిగినప్పటికీ సమాధానం ఇవ్వలేదు. మీరు కంప్లైంట్ చేయండి, డాక్టర్ పై చర్యలు తీసుకుంటాం, అని బాధితులకు చెప్పటం విశేషం.

Leave a Reply