MALLESH | అన్ని వాడల్లో సీసీ రోడ్లు వేయిస్తా

MALLESH | అన్ని వాడల్లో సీసీ రోడ్లు వేయిస్తా
కలమడుగు సర్పంచి అభ్యర్థి బొంతల నాగమణి మల్లేష్
MALLESH | జన్నారంరూరల్, ఆంధ్రప్రభ : గ్రామంలోని అన్ని వాడల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మిస్తానని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు గ్రామపంచాయతీ సర్పంచి కాంగ్రెస్ అభ్యర్థి బొంతల నాగమణి మల్లేష్ అన్నారు. ఇవాళ మధ్యాహ్నం ఆమె మాట్లాడుతూ… తమ కుటుంబానికి రాజకీయ అనుభవం ఉందన్నారు. తమను ఎన్నికల్లో గెలిపించినట్లయితే ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం సేవకురాలుగా పనిచేస్తానని ఆమె చెప్పారు.
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సహకారంతో 10వ డిస్ట్రిబ్యూటరీకాల్వ మరమ్మతులతో పాటు పోచమ్మ గుడి టెంపుల్ నిర్మిస్తానని, సాధ్యమైనంతవరకు కోతుల బెడదను నివారిస్తానని ఆమె హామీ ఇచ్చారు. అపరిస్కృతంగా ఉన్న సమస్యలన్నింటినీ అంచెలంచెలుగా పరిష్కరిస్తానని ఆమె తెలిపారు.
