Mallareddy | యూనివర్సిటీలలో సంక్రాంతి సంబరాలు

Mallareddy | యూనివర్సిటీలలో సంక్రాంతి సంబరాలు
- సంక్రాంతి సంబరాల్లో సిబ్బంది, విద్యార్థులతో కలిసి
- పాల్గొన్న మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి
మేడ్చల్, ఆంధ్రప్రభ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో భాగంగా శుక్రవారం సీఎంఆర్ యూనివర్సిటీలలో మైసమ్మగూడ, కండ్లకోయ వివిధ బ్రాంచీలలో మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీలలోని సిబ్బంది, విద్యార్థులతో కలిసి భోగి పండుగ, భోగి మంటలు, ముగ్గుల పోటీలు, నిర్వహించారు. పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. విద్యార్థులతో కలిసి చామకూర మల్లారెడ్డి డ్యాన్స్ ప్రోగ్రామ్లలో పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు.

