Malladi Vishnu | పేదల ఆరోగ్యానికి వైసీపీ భరోసా
- ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నిర్వీర్యం
- మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
Malladi Vishnu | విజయవాడ (పాయకాపురం), ఆంధ్రప్రభ : వైఎస్సార్‌సీపీ హయాంలో పేదల ఆరోగ్యానికి భరోసానిచ్చిందని, అదే చంద్రబాబు ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ నిర్వీర్యం చేసిందని వైసీపీ సెంట్రల్ ఇంచార్జి మల్లాది విష్ణు అన్నారు. వైఎస్సార్‌సీపీ హయాంలో పేదలకు సైతం కార్పొరేట్ వైద్యంను అందించటం జరిగిందని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆరోగ్యశ్రీను నిర్వీర్యం(Health and wellness) చేసి ప్రజలకు వైద్యం దూరం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ సెంట్రల్ నియోజకవర్గం సమన్వయకర్త మల్లాది విష్ణు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(Jaganmohan Reddy) హయాంలో విజయవాడలో 60 నెట్‌వర్క్ హాస్పిటల్స్ లో ప్రతిరోజు వెయ్యి మందికి ఉచిత వైద్యం అందిసూ గుండె జబ్బు దగ్గరనుంచి వివిధ రకాలైన జబ్బుల వరకు అన్నిటికి వైద్యం అందిస్తూ ప్రజలకు భరోసా కల్పించటం జరిగిందన్నారు.
అలాగే మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రామకృష్ణాపురం,సింగ్‌నగర్, బాంబే కాలనీ, అయోధ్యనగర్ లలో నాలుగు హాస్పిటల్స్(Hospitals) నిర్మించి ప్రజలకి అన్ని రకాల రక్త పరీక్షలు చేయటంతో పాటు మందులు కూడా అందించటం జరిగిందన్నారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు వైద్య సేవలు దూరం అయ్యాయని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హాస్పిటల్స్‌ను నాడు నేడు ద్వారా అభివృద్ధిపరిచి(developed) సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ప్రభుత్వ హాస్పిటల్స్ కి వచ్చి ప్రజలు మెరుగైన వైద్యం పొందేవారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించటంలో విఫలమయ్యిందన్నారు.
కూటమి ప్రభుత్వం గడిచిన 18 నెలలలో రూ. 2 లక్షల 60 వేల కోట్లు అప్పు చేసింది కానీ ఆరోగ్యశ్రీ బకాయిలు తీర్చే ప్రయత్నం చేయలేదన్నారు. సంవత్సరానికి రూ.వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కళాశాలలని(Medical colleges) నడపలేని స్ధితిలో కూటమి ప్రబుత్వం పాలన ఉందన్నారు. విద్యార్థులకి వైద్య విద్యని చేరువ చేయాలనే.. ఉద్దేశంతో సమాజంలో వైద్యులు తయారయ్యి ఆరోగ్యంవంతమైన సమాజం నెలకొల్పే ఉద్దేశంతో ఆలోచన చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన నిర్ణయనికి తూట్లు పొడుస్తూ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు ఇస్తూ నిర్ణయం తీసుకోవటం పట్ల ఆగ్రహం(anger) వ్యక్తం చేశారు.
చంద్రబాబు ప్రభుత్వం తీరు మార్చుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా ఈనెల 15వ తేదీన ఉదయం 9:30గంటలకు అల్లూరి సీతారామరాజు వంతెన వద్ద నుండి చుట్టుగుంట నుంచి ర్యాలీ ప్రారంభమయ్యి శిఖామణి సెంటర్ వరకు సాగుతుందన్నారు. ప్రజా వైద్యంని కాపాడాలని ప్రజలకి వైద్యం మరింత చేరువ చేయాలని ప్రైవేటైజేషన్(Privatization) వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ జిల్లా అన్ని నియోజకవర్గాలలో సంతకాల సేకరణ చేసి వాటిని రాష్ట్ర కార్యాలయానికి ర్యాలీ గా పంపడం జరుగుతుందన్నారు. ర్యాలీకు ప్రతీ ఒక్కరూ తరలి రావాలని పిలుపునిచ్చారు.

