Makthal | ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

Makthal | ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు

  • మక్తల్ ఎస్ఐ భాగ్య లక్ష్మి రెడ్డి

Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : నారాయణ పేట జిల్లా మక్తల్ మండలంలోని మంథన్ గోడ్ గ్రామానికి చెందిన కళ్యాణ్ అనే వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి, అదే గ్రామానికి చెందిన అతని మిత్రుడు కతల్ అనే వ్యక్తి ఇంట్లో తండ్రి, అక్కతో గొడవ పడి సూసైడ్ చేసుకుంటానని చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం అందించారు.

ఈ సమాచారంతో మక్తల్ ఎస్ఐ వై.భాగ్యలక్ష్మి రెడ్డి ఆదేశాల మేరకు డయల్ 100 పీసీ అరుణ్ వెంటనే తక్షణ చర్యలు చేపట్టారు. కతల్ అనే వ్యక్తి లొకేషన్‌ను ఐటీ సెల్ వారి సహకారంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ట్రేస్ చేయగా… సూసైడ్ అటెంప్ట్ కోసం వెళ్లిన వ్యక్తి నర్వ మండలం పతర్ చేడు గ్రామ శివారులో చెట్టు కింద ఉన్నట్లు గుర్తించి అక్కడికి చేరుకున్న పోలీసులు అతడిని సురక్షితంగా అదుపులోకి తీసుకున్నారు.

వెంటనే అతడిని కుటుంబ సభ్యులైన అక్కకు అప్పగించారు. ఈ సందర్భంగా కతల్ అక్క పోలీసుల సత్వర స్పందనకు, మానవత్వంతో వ్యవహరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డయల్ 100కు వచ్చిన సమాచారంపై వేగంగా స్పందించి ఒక ప్రాణాన్ని కాపాడిన మక్తల్ పోలీసుల చర్య అభినందనీయమని పలువురు ప్రశంసించారు.

Leave a Reply