Makthal | రూ.కోటి 15 లక్షలతో సీసీ రోడ్డు పనులు…

Makthal | రూ.కోటి 15 లక్షలతో సీసీ రోడ్డు పనులు…
- రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి
Makthal | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ నియోజకవర్గ అభివృద్ధే నా ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అన్నారు. ఇవాళ నియోజకవర్గ కేంద్రం మక్తల్ పట్టణంలోని 7వ వార్డులో మశమ్మ దేవాలయం నుండి అయ్యప్ప స్వామి దేవాలయం వెనక వరకు రూ.25 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు మంత్రి భూమి పూజ చేశారు. అదేవిధంగా మునిసిపాలిటీ పరిధిలోని చందాపూర్ గ్రామంలో రూ. 90 లక్షల వ్యయంతో చేపడుతున్న సీసీ రోడ్డు సైడ్ డ్రైనేజీ పనులకు మంత్రి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… నియోజకవర్గ అభివృద్ధె నా ధ్యేయమని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం ప్రత్యేకించి పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో నియోజకవర్గం అభివృద్ధిలో నిర్లక్ష్యానికి గురైందని అన్నారు.

ఎంత సేపు సొంత లాభాలు తప్ప నియోజకవర్గ అభివృద్ధి గత పాలకులు పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. మక్తల్ లో ఎక్కడ చూసినా అభివృద్ధికి నోచుకోని ప్రాంతాలే కనిపిస్తాయి అన్నారు. గడిచిన రెండేళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఒక వెయ్యి 35 కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో రెండు ప్రాంతాల్లో ఒక కోటి 15 లక్షల రూపాయలతో చేపడుతున్న సీసీ రోడ్డు డ్రైనేజీ పనులకు భూమి పూజ చేసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ తాగునీటి పైప్ లైన్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని తెలిపారు.
మక్తల్ నియోజకవర్గ కేంద్రం తో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. పూర్తి స్థాయిలో అభివృద్ధి పరచడం జరుగుతుందని అందుకు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మంత్రి వాకిటి శ్రీహరి విజ్ఞప్తి చేశారు. అభివృద్ధిని కోరుకునే వారు ఎవరైనా మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు. మీ అందరి ఆశీర్వాదంతోనే అభివృద్ధికి అవసరమైన నిధులు తీసుకొస్తున్నామని మరింత అభివృద్ధి కోసం మీ అండ దండ కావాలని మంత్రి విన్నవించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గవినోళ్ళ బాలకృష్ణారెడ్డి, కట్టా సురేష్ కుమార్ గుప్తా, బి .గణేష్ కుమార్, బోయ రవికుమార్ ,కోళ్ళ వెంకటేష్, సాలంబిన్ ఉమర్ బస్రవి, నీల గౌడ్, గోవర్ధన్ బి. శంషుద్దీన్, కావాలి శ్రీహరి, వల్లంపల్లి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
