మున్సిపల్ చైర్ పర్సన్ గా వాకిటి మానస హన్మంతు

మున్సిపల్ చైర్ పర్సన్ గా వాకిటి మానస హన్మంతు

వైస్ చైర్ పర్సన్ గా శైవిరెడ్డి


మక్తల్ , ఫిబ్రవరి 16 (ఆంధ్రప్రభ) : నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపల్ నూతన పాలకవర్గం చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ పేర్లను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారికంగా ప్రకటించారు. ఎన్నికలకు కొద్దిసేపటి ముందు ఆయన పార్టీ సీనియర్ నాయకులతో కలిసి చైర్పర్సన్ల పేర్లను ప్రకటించారు.

మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ కు రిజర్వు కాగా ఎన్నికల్లో 16 వార్డులకు గాను 6వ వార్డు బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన ౠరుకలి మహాదేవప్ప ఆత్మహత్య చేసుకోవడంతో 15 వార్డులకు ఎన్నికలు జరిగాయి. 15 వార్డుల్లో 12 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందగా మూడు వార్డుల్లో బిజెపి అభ్యర్థులు గెలిచారు. వీరిలో 14 వ వార్డు నుండి గెలుపొందిన వాకిటి మానస హన్మంతు ను మున్సిపల్ చైర్ పర్సన్ గా మంత్రి ప్రకటించారు. అదేవిధంగా 9 వ వార్డు నుండి గెలుపొందిన శైవిరెడ్డిని వైఫ్ చైర్పర్సన్ గా మంత్రి ప్రకటించారు .వీళ్ళిద్దరూ ఈరోజు మక్తల్ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ గా ప్రాణమా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

Leave a Reply