Majority | వరలక్ష్మిని గెలిపించండి

Majority | వరలక్ష్మిని గెలిపించండి

  • అభివృద్ధిని ఆశించండి
  • పేరూరు పంచాయతీలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తాం.. మంత్రి సీతక్క

Majority | వాజేడు, ఆంధ్రప్రభ : ఈనెల 17న జరగబోయే పంచాయితీ ఎన్నికల్లో ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని పేరూరు పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గొడ్డే వరలక్ష్మి అత్యధిక మెజార్టీతో గెలిపించండి.. అభివృద్ధిని ఆశించండి.. అని పంచాయతీరాజ్ అండ్ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. పేరూరు పంచాయతీలో ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లును అందించడమే లక్ష్యమన్నారు. ఎన్నికల పర్యటనలో భాగంగా పేరూరు సర్పంచ్ అభ్యర్థి గొడ్డే వరలక్ష్మి వార్డు మెంబర్లు మంత్రి సీతక్కకు భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకటరావుకు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. పేరు పంచాయతీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు.

గత పదేళ్లు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని, పంచాయతీలో తాగునీటి సమస్య, వీధి రోడ్ల సమస్య, కరెంటు సమస్యపై వివరించడం జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించి తీసుకువస్తే మీ పంచాయితీ అభివృద్ధికి నేను సహాయ సహకారాలు అందిస్తానని నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. పేరూరు పంచాయతీలో 540 ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు అర్హులుగా ఉన్నారని, వారందరికీ రాబోయే రెండవ దఫా ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో కేటాయించడం జరుగుతుందని తెలిపారు.

అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది… కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపించినట్లయితే పంచాయతీని మరింతగా అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పైడాకుల అశోక్ బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఇరుస వడ్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, కాంగ్రెస్ నాయకులు దంతులూరి విశ్వనాథ ప్రసాద్ రాజు కళ్యాణ్ బాబు సీతారామరాజు వత్సవాయి జగన్నాథరాజు అరికెళ్ల వేణు నల్లగా సి రమేష్ బొల్లె వెంకన్న కురుసం కృష్ణమూర్తి ఆత్మకూరి ప్రవీణ్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

పోలీస్ స్టేషన్ రోడ్డు తెరిపిస్తాం :
పేరూరు పంచాయతీలోని పోలీస్ స్టేషన్ రోడ్డును గత కొద్ది సంవత్సరాలుగా మూతపడి ఉందని మంత్రి సీతక్క దృష్టికి పేరూరు పంచాయతీ అభ్యర్థి గుడ్డి వరలక్ష్మి తీసుకెళ్లడంతో వెంటనే స్పందించిన మంత్రి సీతక్క త్వరలోనే పోలీస్ స్టేషన్ రోడ్డును తెరిపించి రైతులకు, ప్రజలకు వైద్యశాలకు వెళ్లే రోగులకు ఇబ్బంది లేకుండా చేస్తామని తెలిపారు.

Leave a Reply