Fire accident | జమ్మూకశ్మీర్ లో భారీ అగ్ని ప్ర‌మాదం

జమ్మూకశ్మీర్ : గందర్‌బల్ జిల్లాలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. గందర్‌బల్ జిల్లాలోని సోనామార్గ్ మార్కెట్‌లోని ఓ హోటల్‌లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. ఆ మంటలు సమీపంలోని 50 దుకాణాలు, రెస్టారెంట్లకు వ్యాపించాయి.

ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *