Maithili Thakur | ఎంట్రీ అదుర్స్ క‌దూ…

Maithili Thakur | ఎంట్రీ అదుర్స్ క‌దూ…

  • యంగెస్ట్ ఎమ్మెల్యే అస‌లు క‌థ ఇదే…
  • గాయ‌ని నుంచి ఎమ్మెల్యే దాకా..
  • ఎన్నిక‌ల‌ ప్ర‌చారం నుంచే వైవిధ్యం..

ఆంధ్ర‌ప్ర‌భ : బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే భారీ విజయం సాధించి. అయితే, ఈ ఎన్నిల కౌంటింగ్ త‌రువాత మాత్రం… అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది బీజేపీ అభ్య‌ర్థి మైథిలి ఠాకూర్.

ఈ ఏడాది అక్టోబర్ 14న బీజేపీలో చేరిన మైథిలి (Maithili Thakur)… అలీనగర్ నుంచి బరిలో దిగి.. రాజకీయాల్లో తొలి అడుగే అదిరిపోయేలా వేశారు. రాష్ట్రీయ జనతాదళ్ (Grand Alliance) అభ్యర్థి, వినోద్ మిశ్రాపై 11,730 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించి ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు.

కేవలం 25 ఏళ్లకే శాసనసభకు ఎన్నికై.. యంగెస్ట్ MLAగా నిలిచిన మైథిలి.. దేశ‌వ్యాప్తంగా ప్రశంసల వర్షం అందుకుంటున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మైథిలి ఠాకూర్‌ను ఎన్నికల సంఘం బీహార్ ‘స్టేట్ ఐకాన్’గా నియమించింది.

Maithili Thakur | రాజకీయాల్లోకి రాకముందు..

ఇయ‌ర్ 2000 జూలై 25న జన్మించిన మైథిలీ ఠాకూర్.. బీహార్‌లోని మధుబని జిల్లా బేనిపట్టికి చెందినవారు. తండ్రి రమేష్ ఠాకూర్ సంగీత ఉపాధ్యాయుడు కాగా, తండ్రి–తాతల మార్గదర్శకత్వంలో చిన్నప్పటి నుంచే సంగీతం నేర్చుకున్నారు మైథిలి. జానపద, శాస్త్రీయ సంగీతం రెండింటినీ రుచిచూసి, తనకంటూ ప్రత్యేక శైలి తెచ్చుకున్నారు.

Maithili Thakur

భోజ్‌పురి, హిందీ భాషలలో భక్తి, జానపద గీతాలను పాడటానికి ప్రసిద్ధి చెందిన మైథిలీ.. భారతదేశంలోనే కాకుండా విదేశాలలో కూడా పాటలు పాడింది.

బీహార్ జానపద సంగీతానికి ఆమె చేసిన కృషికి గాను 2021లో సంగీత నాటక అకాడమీ నుండి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్‌ను అందుకున్నారు.

2024లో అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఆమె పాడిన శబరి పాట సోషల్ మీడియాలో దుమ్ము రేపింది. ఆమె పాడిన తీరు మెచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. రామాయణంలో శబరి శ్రీరాముడికి పండ్లు సమర్పించిన ఘట్టాన్ని మైథిలీ తన స్వరంలో అద్భుతంగా పాడిందని మోడీ పేర్కొన్నారు. స్వయంగా ప్ర‌ధాని ప్రశంసించడం మైథిలికి పెద్ద గుర్తింపే.

Maithili Thakur

అదే ఉత్సాహంతో సోషల్ మీడియాలో పాటలు పోస్ట్ చేస్తూ… తన ఫాలోయింగ్‌ను వేగంగా పెంచుకుని, పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది మైథిలి. ఇప్పుడు రాజకీయాల్లోకి కొత్తగా అడుగుపెట్టిన గాయని మైథిలి ఠాకూర్.. తన తొలి అసెంబ్లీ ఎన్నికల ప్రయత్నంలోనే అద్భుత విజయాన్ని అందుకున్నారు. ఆమె గెలుపుతో యంగెస్ట్ ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. త‌న సంచలన విజయంతో దేశం చూపుని ఆమె వైపు మళ్లించుకున్నారు మైథిలి ఠాకూర్.

Maithili Thakur

Movie Clash | చరణ్‌, నాని.. తగ్గేదెవరు..?

Leave a Reply