ముంబై : మహారాష్ట్రలోని ముంబై (Mumbai)లో ఉన్న బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ కు ఇవాళ బాంబు బెదిరింపు (Bomb threat) మెయిల్ వచ్చింది. తక్షణమే పోలీసులకు ఈ సమాచారాన్ని చేరవేశారు. బాంబు స్క్వాడ్ బృందాలు (Bomb squad teams), పోలీసులు (police) స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో తనిఖీలు నిర్వహించారు. అనుమానిత వస్తువులను గుర్తించలేదు.
బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో ఉన్న భారీ బిల్డింగ్‌లో సుమారు నాలుగు ఆర్డీఎక్స్ ఐఈడీ బాంబులను అమర్చినట్లు మెయిల్‌లో పేర్కొన్నారు. బెదిరింపు మెయిల్ పట్ల గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మాతా రామాబాయ్ అంబేద్కర్ మార్గ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు (Case registration) చేశారు. భారతీయ న్యాయ సంహితలోని 351(1)(b), 353(2), 351(3), 351(4) సెక్షన్ కింద కేసును రిజిస్టర్ చేశారు. ఈ కేసులో పోలీసులు మరింత దర్యాప్తు చేపడుతున్నారు.