CRICKET | మహేష్ ఎంపిక

CRICKET | మహేష్ ఎంపిక


CRICKET | మక్తల్, ఆంధ్రప్రభ : మక్తల్ పట్టణానికి చెందిన మహేష్ అండర్-19 జిల్లా క్రికెట్ జట్టుకు (Discrict Cricket Team) ఎంపికయ్యారు. ఈమేరకు శుక్రవారం పుడమి ఫౌండేషన్ చైర్మన్ వెంకటపతి రాజు జిల్లా క్రికెట్ జట్టుకు ఎంపికైన మహేష్ ను శాలువాతో ఘనంగా సన్మానించి, అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చిన్నప్పటి నుండి క్రికెట్ పై ఉన్న మక్కువతో క్రికెట్ లో అత్యున్నత ప్రతిభ కనబరచడంతో జిల్లా స్థాయి పోటీలో ప్రతిభ చూపడంతో రాష్ట్రస్థాయిలో అండర్-19 క్రికెట్ పోటీలకు జిల్లా జట్టుకు ఎంపికైనట్లు ఆయన తెలిపారు.

పుడమి ఫౌండేషన్ కు వెన్నుదన్నుగా నిలిచిన మహేష్..

పట్టణంలోని స్కాలర్స్ జూనియర్ కాలేజీలో చదువుకుంటూ ప్రతిభను కనపరిచిన మహేష్ కు పుడమి ఫౌండేషన్ అండగా ఉంటుందన్నారు. అట్టడుగు వర్గాల విద్యార్థులు (The Students) విద్యారంగంతో పాటు క్రీడల్లో కూడా మంచి ప్రావీణ్యతను సాధించి అత్యున్నత స్థాయికి ఎదగాలన్నారు. మక్తల్ పట్టణానికి చెందిన మహేష్ దేశానికే ప్రాతినిధ్యం వహించాలని ఆయన ఆకాంక్షించారు. కష్టపడి మరింత ముందుకు వెళ్లాలని కోరారు. ఈ క్రమంలో మహేష్ కు పుడమి ఫౌండేషన్ వెన్నుదన్నుగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పుడమి ఫౌండేషన్ ఈసీ మెంబర్ ప్యాట పవన్ కళ్యాణ్, కడెచుర్ ఆంజనేయులు, శ్రీను, ఎల్లలింగ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply