Mahesh Babu | వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?

Mahesh Babu | వారణాసి రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా..?
Mahesh Babu, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి.. ఈ క్రేజీ కాంబోలో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీ వారణాసి. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఎక్స్ పెక్టేషన్స్ ఓ లెవల్లో ఉన్నాయి. ఇక ఈ సినిమా (Movie) టైటిల్ అండ్ గ్లింప్స్ రిలీజ్ చేసిన తర్వాత అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే.. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ చేస్తారో అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ అంటూ న్యూస్ లీకైంది. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. వార్త మాత్రం వైరల్ అయ్యింది. ఇంతకీ.. వారణాసి వచ్చేది ఎప్పుడు..?
Mahesh Babu | 1300 కోట్ల భారీ బడ్జెట్..
మహేష్, రాజమౌళి కాంబినేషన్లో మూవీని ఎప్పటి నుంచో తీయాలి అనుకుంటున్నారు దుర్గా ఆర్ట్స్ అధినేత డా.కెల్. నారాయణ. అది ఇప్పుడు నెరవేరుతుంది. రాజమౌళి ఎప్పుడో ఇచ్చిన మాట ప్రకారం.. ఈ సంస్థకు సినిమా చేస్తుండడం విశేషం. ఇందులో కథానాయికగా బాలీవుడ్ అండ్ హాలీవుడ్ (Hollywood) బ్యూటీ ప్రియంకా చోప్రా నటిస్తుంటే.. విలన్ గా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నారు. ఈ క్రేజీ పాన్ వరల్డ్ మూవీకి పాన్ ఇండియా స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్ కథ అందించగా, ఆస్కార్ అవార్డ్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. డివోషనల్ టచ్ తో.. హాలీవుడ్ రేంజ్ లో రాజమౌళి ఈ సినిమాని దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందస్తున్నారు. ?

Mahesh Babu | 2027 ఏప్రిల్ 9న వారణాసి రిలీజ్..
ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించకపోయినా 2027లో వస్తుందని ఇంత వరకు ప్రచారం జరిగింది. ఇప్పుడు రిలీజ్ డేట్ (Release Date) ఫిక్స్ అయ్యిందని… 2027లో ఏప్రిల్ 9న ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. అంతే కాదు.. ఇంత వరకు తెలుగు సినిమానే కాదు.. ఏ ఇండియన్ సినిమా రిలీజ్ చేయని విధంగా కనీవినీ ఎరుగని విధంగా భారీగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే.. ఇది నిజమో కాదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త ఊపేస్తుంది. జక్కన్న మాత్రం సైలెంటుగా షూటింగ్ చేస్తున్నారు. మరి.. ప్రచారంలో ఉన్న ఈ వార్త పై క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

CLICK HERE TO READ నేటి తరానికి స్ఫూర్తి పూలే – సీఎం రేవంత్ రెడ్డి
