చిట్యాలలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి

చిట్యాల, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో శనివారం ఏవైఎస్ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో ఏవైఎస్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య, మండల అధ్యక్షుడు జన్నే యుగంధర్ మాట్లాడుతూ.. అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళల విద్యా విస్తరణకు మహాత్మా ఫూలే చేసిన సేవలు అమూల్యమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల మాజీ అధ్యక్షుడు సరిగొమ్ముల రాజేందర్, మండల నాయకులు చందర్, రాజమౌళి, లక్ష్మయ్య, గౌడ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రం తిరుపతి, బీసీ సంఘాల నాయకులు నరసయ్య, మల్లేష్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply