Maharastra – ఎట్టకేలకు రేపిస్ట్ అరెస్ట్‌

మహారాష్ట్రలోని పూణే అత్యాచార కేసులో నిందితుడు దత్తాత్రేయ్‌ రామ్‌దాస్‌ గాదేను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. దారుణ ఘటన తర్వాత 75 గంటల గాలింపు అనంతరం నిందితుడు పోలీసులకు చిక్కాడు.నిందితుడి కోసం పోలీసులు 13 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు.

వివరాల ప్రకారం.. పూణేలోని స్వర్‌గేటు బస్టాండ్‌ వద్ద 26 ఏళ్ల యువతిపై బస్సులో అత్యాచారానికి పాల్పడిన దత్తాత్రేయ్‌ రామ్‌దాస్‌ పోలీసులకు చిక్కాడు. 75 గంటల గాలింపు చర్యల అనంతరం నిందితుడు రామ్‌దాస్‌ను శుక్రవారం తెల్లవారుజామున శ్రీరూర్‌ వద్ద పోలీసులు అరెస్ట్‌ చేశారు.

అనంతరం, పోలీసు స్టేషన్‌కు తరలించారు. అ‍త్యాచార ఘటన తర్వాత నిందితుడు పరారీలో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడి ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు అందజేస్తామని పోలీసుశాఖ సైతం తెలిపింది.

Leave a Reply