Mahakumbamela | త్రివేణి సంగంలో నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానం ..
ప్రయోగరాజ్ , ఆంధ్రప్రభః ఏపీ మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు వెళ్లారు. ఈ సందర్బంగా ఇవాళ తెల్లవారుజామున నారా భార్య బ్రాహ్మణి కుమారుడు దేవాన్ష్‌తో కలిసి త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానం చేశారు. ఓ పడవలో నదుల సంగమం వద్దకు చేరుకొని ప్రత్యేక పూజాలు నిర్వహించారు. ఆ తర్వాత వారణాసి కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు. ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ వద్ద తీసుకున్నసెల్పీని ట్వీట్ చేసి నిజంగా ఆశ్వీదించబడ్డాం అని లోకేశ్ సెల్పీని ట్వీట్ చేశారు.
అలాగే సాయంత్రం 3.40 గంటలకు వారణాసికి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సాయంత్రం 4 గంటలకు విశాలాక్షి దేవాలయాన్ని సందర్శిస్తారు. ఈ ఆలయం సందర్శన అనంతరం సాయంత్రం 5.25 గంటలకు వారణాసి నుంచి విజయవాడకు తిరుగు పయణమవుతారు