Mahabubnagar | టిఎన్జీవోస్ ఎన్నికలు
Mahabubnagar | మక్తల్, ఆంధ్రప్రభ : టీఎన్జీవోస్ యూనియన్ బైలాస్ ప్రకారం మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలను మక్తల్ యూనిట్ గా టీఎన్జీవోస్ నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగిందని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా(Mahabubnagar District) టీఎన్జీవోస్ యూనియన్ కన్వీనర్ జి. రాజీవ్ రెడ్డి తెలియజేశారు.
ఈ రోజు ఆయన మక్తల్‌లో స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ.. మక్తల్ యూనిట్ టీఎన్జీవోస్ ఎన్నికల నిర్వహణకు గాను ఇదివరకే నోటిఫికేషన్(Notification) జారీ చేయడం జరిగిందన్నారు. ఎన్నికల అధికారిగా నియమించబడిన మూలే దామోదర్(Moole Damodar) మక్తల్ యూనిట్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు.
ఈనెల 14న మక్తల్‌లోని ఎంపీడీవో ఆఫీస్(MPDO Office)లో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలకు సంబంధించిన నాన్ గజిటేడ్ అధికారులు(Non-Gazetted Officers) ఈ ఎన్నికల్లో పాల్గొని ఉద్యోగుల ఐక్యతను చాటవలసిందిగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా టీఎన్జీవోస్ యూనియన్ కన్వీనర్ జి. రాజీవ్ రెడ్డి తెలియజేశారు.
నారాయణపేట జిల్లా(Narayanpet District) నూతనంగా ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సారిగా ఎన్నికలు నిర్వహించుటకు టీఎన్జీవోస్ యూనియన్ కేంద్ర సంఘం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీవోస్ యూనియన్ ఎప్పుడూ కృషి చేస్తుందని, అందుకే ఉద్యోగులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని సూచించారు. ఈ నెలలోనే జిల్లాలోని అన్ని యూనిట్ల ఎన్నికలు నిర్వహించి, జిల్లా ఎన్నికలు పూర్తి చేసి పూర్తి స్థాయిలో నూతన కార్యవర్గం ఏర్పాటు చేస్తామని రాజీవ్ రెడ్డి తెలియజేశారు.

