అహోబిలంలో మహా పూర్ణాహుతి

అహోబిలంలో మహా పూర్ణాహుతి
ఆళ్లగడ్డ,(నంద్యాల జిల్లా) ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం ఎగువ అహోబిలం(Ahobilam) క్షేత్రంలో సోమవారం మహా పూర్ణాహుతితో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి పవిత్రోత్సవం వైభవంగా ముగిసింది. ఎగువ అహోబిలం ఉత్సవమూర్తి జ్వాల నరసింహస్వామి, శ్రీ చెంచులక్ష్మి , శ్రీదేవి భూదేవి విగ్రహాలకు విశేష పూజలు నిర్వహించారు. స్వామికి పట్టు పవిత్ర మాలలతో అలంకరించి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించారు.
అహోబిలం మఠం 46వ పీఠాధిపతి శ్రీమాన్ శఠగోప శ్రీ రంగనాథ(Sriman Shathagopa Sri Ranganatha) యతీంద్ర మహాదేశికన్ స్వామి స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ముగిసినట్లు దేవస్థానం ప్రధాన అర్చకులు కీడాంబి వేణుగోపాల్ స్వామి తెలిపారు. చెన్నై, కాంచీపురం తదితర ప్రాంతాల నుండి వచ్చిన వేద పండితులు వేద గోష్టి కార్యక్రమాలలో పాల్గొన్నారు.


