Maha Kumbh Mela | త్రివేణి సంగమంలో రాష్ట్ర‌ప‌తి పుణ్యస్నానం

ప్రయాగ్ రాజ్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. అనంతరం ప్రయాగ్ రాజ్ లోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు త్రివేణి సంగమం ప్రాంతంలో రాష్ట్రపతి పడవలో పర్యటించారు. కుంభమేళాలో రాష్ట్రపతితో పాటు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో కుంభమేళాలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

Leave a Reply