Maha Kumbamela |త్రివేణి సంగమం ఘాట్ లో మంత్రి కోమటిరెడ్డి పుణ్య స్నానం
ప్రయాగ రాజ్ : ప్రయాగరాజ్‌లో వైభవంగా జరుగుతున్న మహా కుంభమేళాకు దేశ విదేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించి, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ నేపథ్యం లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. సంగం ఘాట్‌లో మంత్రి కోమటిరెడ్డి ప్రత్యేక పూజలు..తాజాగా ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. . అనంతరం అక్కడి ఘాట్‌లలో ప్రత్యేక పూజలు చేశారు. నేటి ఉదయం 5 గంటల 10 నిమిషాలకు ప్రయాగరాజ్‌లోని సంగం ఘాట్‌లో మంత్రి పుణ్యస్నానం గావించారు.
తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్‌లో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు మంత్రికి వేద ఆశీర్వచనం ఇచ్చారు. అనంతరం బడే హనుమాన్ దేవాలయాన్ని సందర్శించి ఆంజనేయస్వామికి మంత్రి కోమటిరెడ్డి మొక్కులు సమర్పించారు. మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి పూజారులు ఆశీర్వదించారు.