మహానందిలో.. మహా దసరా
- అశ్వ వాహనంపై నిజ రూపంలో దర్శనం
(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : దసరా మహోత్సవాల్లో నంద్యాల జిల్లా మహానందిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కామేశ్వరి ఆలయం (Kameshwari Temple) లో పదవ రోజు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆశ్వీయుజ శుద్ధ నవమి, బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం రోజున ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్యనిర్వాహణా అధికారి శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy) తెలిపారు. శ్రీ కామేశ్వరీ అమ్మవారి మూలమూర్తికి అలంకారం చేపట్టారు. దీక్షా అలంకారంలో అశ్వ వాహనంపై శ్రీ కామేశ్వరీ నిజరూపాన్ని ప్రదర్శించారు. చిద్విలాసిని కామేశ్వరి ఈ పండుగను పదిరోజులు నిర్వహించిన రాత్రులు మాత్రం తొమ్మిదే. దశమి రోజున అమ్మవారు కామేశ్వరీ అవతారంలో రాక్షస సంహారం చేసి ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వుతో సకల విజయాలను ప్రసాదిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.
ఇక తొమ్మిది రోజుల్లోనూ సువాసినీ పూజ కార్యక్రమం చేపట్టారు. ప్రతిరోజూ ఒక మల్లె పూవును అమ్మవారిగా భావన చేసి ఆమెకు సర్వ ఉపచారాలు చేసి, వస్త్రం, ఫలం సమర్పిస్తారు. ఈ పది రోజులూ పసుపు, కుంకుమ, పువ్వులు, గాజులు పంచిపెడితే సౌభాగ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. దేవీ భాగవత పారాయణం, శ్రీదేవీ సప్తశతీ పారాయణం, హోమం సర్వ శ్రేష్ఠం. దుర్గా ద్వాత్రింశ మాలాస్తోత్రం 108 సార్లు పారాయణం చేస్తే అఖండ ఫలితాలు (Overall results) లభిస్తాయని వేద పండితులు చెబుతున్నారు. కుమారీపూజను ఆచరించి మంచి ఫలితాలను పొందవచ్చని పండితులు చెబుతున్నారు. రోజుకొక బాలికను పూజించాలని, కేవలం 10 ఏళ్లలోపు బాలికలు మాత్రమే ఉండాలనే నిబంధనతో, భక్తి శ్రద్ధలతో పూజించి ఆ తల్లిని కోరితే తప్పక ఆమె కరుణిస్తుందని భక్తుల నమ్మకం.