Mafia | విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు…

Mafia | విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు…

భారీగా నిల్వలు స్వాధీనం, ఇద్దరు నిందితుల అరెస్ట్…
నంద్యాల బ్యూరో ఫిబ్రవరి 26 ఆంధ్రప్రభ
నేడు ప్రపంచమంతా కల్తీ యుగమైపోయింది.

Mafia | నంద్యాల‌, ఆంధ్ర‌ప్ర‌భ : కళ్ళ నీళ్లు.. కన్నతల్లి పాలు తప్ప అన్నీ కల్తీ చేస్తున్న కల్తీ ముఠా నాయకులు.ఈ సమాజంలో ప్రతి ఒక్కటి కల్తీ… కల్తీ.. గా తయారు చేస్తూ ప్రజల ప్రాణాలు హరిస్తున్న సంఘటనలు కోకోళ్ళలు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గం లోని ఆత్మకూరు పట్టణంలో గురువారం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కల్తీ మాఫియా గుట్టును విజిలెన్స్ అధికారులు రట్టు చేసిన సంఘటన చోటుచేసుకుంది.

ఆత్మకూరు పట్టణ కేంద్రంగా సాగుతున్న కొన్ని నెలలుగా జరుగుతున్న ఈ తంతును వెలుగులోకి రావడం విశేషం. పట్టణంలోనే నకిలీ నెయ్యి తయారీ కేంద్రాన్ని గుర్తించరు. భారీగా కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. వందల లీటర్లను స్వాధీనం చేసుకున్నరు.

Mafia | వెభయంకరమైన నిజాలు

అధికారుల తనిఖీల్లో వెభయంకరమైన నిజాలు వెలుగు చూడటంతో స్థానికులు పోలీస్ అధికారులు విజిలెన్స్ అధికారులు విస్తుపోయారు.పట్టణంలోని ఎరుకలపేటలో గల ఒక ఇంట్లో గత కొంతకాలంగా రహస్యంగా కల్తీ నెయ్యి తయారీ సాగుతోందన్న సమాచారాన్ని పోలీసులకు అందించారు. ఇద్దరు నిందితులను గుర్తించారు. నాణ్యత లేని నూనెలు, ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తూ స్వచ్ఛమైన నెయ్యిగా నమ్మిస్తూ మార్కెట్లోకి తరలిస్తున్నరన్న ఆరోపణలతో అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్, స్థానిక పోలీసులు సంయుక్తంగా మెరుపు దాడులు నిర్వహించారు.

Mafia |

ఈ దాడుల్లో భారీ ఎత్తున నిల్వ ఉంచిన కల్తీ నెయ్యితో పాటు తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలను అధికారులు సీజ్ చేశారు.​​ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ పవన్ కిషోర్, ఆత్మకూరు అర్బన్ సీఐ మహేశ్వర్ రెడ్డి లు ఈ దాడుల్లో పాల్గొన్నారు. వారు తెలిపిన సమాచారం మేరకు కొన్ని నెలలుగా ఈ కల్తీ నెయ్యిని తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు తెలిపారు. సంఘటనా స్థలంలో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. తయారీ కేంద్రంలో లభ్యమైన నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.

నివేదిక వచ్చిన తర్వాత ఈ కల్తీలో ఏయే ప్రమాదకర రసాయనాలు కలిపారనేది పూర్తిస్థాయిలో వెలుగులోకి వస్తుందన్నారు.ఈ ముఠా వెనుక ఉన్న అసలు సూత్రధారులు, వారి నెట్‌వర్క్ ఎక్కడెక్కడ ఉందనే కోణంలో ప్రత్యేక దర్యాప్తు బృందాల ద్వారా ముమ్మరం చేశామన్నారు. ఈ దాడుల్లో డిస్ట్రిక్ట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఓ. వెంకట రాముడు, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కాశీం వలి, అగ్రికల్చర్ ఏవో విశ్వనాథ్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply