సీఎం రేవంత్‌ను కలిసిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి

ఆంధ్రప్రభ: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన మోహన్ యాదవ్ శనివారం జూబ్లిహిల్స్‌లోని సీఎం రేవంత్ అధికారిక నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు. తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను సీఎం రేవంత్ ఈ సందర్బంగా వివరించారు.
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీతో పాటు ప్రభుత్వం చేపడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమాలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి చెప్పారు. ఆయా పధకాల అమలు,ఇతర అంశాలపై ఇరువురు సీఎంలు చర్చించుకున్నట్టు సమాచారం.
