Madhurnagar| నిందితులతో ఆ పని చేయించిన పోలీసులు…

ఆంధ్రప్రభ , హైదరాబాద్ : నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు చిన్న చిన్న కేసుల్లో నిందితులుగా ఉన్న వ్యక్తులతో మధుర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణకాంత్ పార్క్‌లో ఈరోజు సామాజిక సేవా కార్యక్రమం నిర్వహించారు. కోర్టు సూచించిన విధంగానే ఈ కార్యక్రమం చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
కోర్టు నిర్దేశించిన ఈ సేవా కార్యక్రమంలో మొత్తం 42 మంది నిందితులు పాల్గొన్నారు. వీరిలో మధుర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసుల నుంచి 25 మంది, బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసుల నుంచి 12 మంది, పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు చెందిన కేసుల నుంచి 5 మంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని… పాల్గొన్న నిందితులు అందరూ కోర్టు కేటాయించిన సామాజిక సేవా పనులను పూర్తి చేసినట్లు పోలీసులు తెలిపారు.





