మహిళలకు సువర్ణ అవకాశం..

మహిళలకు సువర్ణ అవకాశం..

ఆరు అంగన్వాడి కార్యకర్త పోస్టులు మరియు 77 అంగన్వాడి సహాయకురాలు పోస్టులు

మచిలీపట్నం, ఆంధ్రప్రభ : కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ అనుమతితో జిల్లాలో ఈ దిగువ పేర్కొనబడిన 8 ఐసిడియస్ ప్రాజెక్టలలోని అంగన్వాడి కేంద్రములలో 6 అంగన్వాడి కార్యకర్త, పోస్టులు మరియు 77 అంగన్వాడి సహాయకురాలు పోస్టులు రోస్టర్ అనుసరించి భర్తీ చేయుటకు దరఖాస్తులు కోరబడుచున్నట్లు జిల్లా స్త్రీ శిశు సంక్షేమ మరియు సాధికార అధికారిణి యమ్.యన్.రాణి తెలిపారు. బందరు, బంటుమిల్లి, పామర్రు, గుడివాడ, కంకిపాడు, మొవ్వ, గన్నవరం, అవనిగడ్డల్లో పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తెలిపారు.

అర్హత గల అభ్యర్ధులు సిడిపిఓ ఆఫీసులను సంప్రదించి 17వ లోపు దరఖాస్తు చేసుకోవలసినదిగా కోరారు. అంగన్వాడి కార్యకర్త, మరియు అంగన్వాడి సహాయకురాలు పొస్టులకు గాను అభ్యర్ధులు 21 సంత్సరముల నుండి 35 సంత్సరముల లోపు వయసు కలవరాయ 10వ తరగతి ఉత్తిర్ణత పొంది, వివాహిత అయి వుండవలెనన్నారు. మిగతా వివరాలకు సంబధిత ఐసిడియస్ కార్యాలయం అధికారులను సంప్రదించ వలసినదిగా తెలియజేశారు.

Leave a Reply