గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 38

న హి జ్ఞానేన సదృశం
పవిత్రమిహ విద్యతే |
తత్స్వయం యోగసంసిద్ధ:
కాలేనాత్మని విందతి ||

తాత్పర్యము : ఈ జగము నందు ఆధ్యాత్మిక జ్ఞానము వలె పవిత్రమైనది మరియు మహోన్నతమైనది వేరొక్కటి లేదు. సకల యోగముల పక్వఫలమైన ఆ జ్ఞానమును భక్తియోగాభ్యాసమునందు పరిపక్వతను సాధించినవాడు కాలక్రమమున తన యందే అనుభవించును.

భాష్యము : మనము దివ్య జ్ఞానమును గురించి మాట్లాడినప్పుడు, ఆధ్యాత్మిక అవగాహనతో చర్చిస్తున్నామని అర్ధం చేసుకోవాలి. అందువలన దానికంటే పవిత్రమైనది, ఉన్నతమైనది మరియొకటి లేదు. అజ్ఞానము బంధమునకు కారణము కాగా, అట్టి జ్ఞానము ముక్తికి కారణమై యున్నది. అదియే భక్తియోగ పక్వఫలము. అట్టి దివ్యజ్ఞానము కలిగి ఉన్నవాడు శాంతిని తన యందే అనుభవించుటచే దాని కొరకు బయట వెదకనవసరము లేదు. అనగా జ్ఞానము మరియు శాంతి చివరకు కృష్ణభక్తిరసభావనగానే మార్పు చెందును. ఇదియే భగవద్గీత యొక్క తుది వాక్యము.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *