గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 4, శ్లోకం 27

27
సర్వాణీంద్రియకర్మాణి
ప్రాణకర్మాణి చాపరే |
ఆత్మసంయమయోగాగ్నౌ
జుహ్వతి జ్ఞానదీపితే

తాత్పర్యము : ఇంద్రియ, మనోనియమము ద్వారా ఆత్మానుభవమును సాధించగోరు ఇంకొందరు ఇంద్రియ కర్మలను మరియు ప్రాణవాయువు కర్మలను మనో నియమమనెడి అగ్ని యందు ఆహుతులుగా అర్పింతురు.

భాష్యము : ”పతంజలి” యోగ పద్ధతిలో, ఇంద్రియ భోగనుభవమునకు ఆకర్షితుడైన వ్యక్తిని ”పరాగాత్మ” అని ఆత్మ సాక్షాత్కారమును పొందిన వ్యక్తిని ”ప్రత్యగాత్మ” అని అంటారు.
పతంజలి యోగ పద్ధతి మన శరీరములోని పది రకాల వాయువులను ఎలా నియంత్రిస్తే ఆత్మ పరిశుద్ధికి, భౌతిక విముక్తికి దోహదము చేస్తాయో తెలియజేస్తుంది. ఎవరైతే జీవితమునే లక్ష్యముగా భావిస్తారో వారు అన్ని రకాల కార్యాలను ఆత్మ సాక్షాత్కారము కొరకు మాత్రమే వినియోగిస్తారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *