గీతాసారం… (ఆడియోతో…)

అధ్యాయం 3, శ్లోకం 31
31

యే మే మతమిదం నిత్యమ్‌
అనుతిష్ఠంతి మానవా: |
శ్రద్ధావంతో2నసూయంతో
ముచ్యంతే తే2పి కర్మభి: ||

అర్థము : ఎవరైతే నా అజ్ఞానుసారము శ్రద్ధతో, నా పట్ల అసూయ లేకుండా తమ కర్మలను నిర్వహిస్తారో వారు కామ్య కర్మ బంధముల నుండి ముక్తులగుదురు.

భాష్యము : దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఆదేశము సర్వ వేద సారమై ఉన్నది. దానికి మించిన పరమ సత్యము మరి యొకటి లేదు. వేదవాక్కు వలే కృష్ణ చైతన్యము నిత్యమైనది. కాబట్టి ప్రతి ఒక్కరూ శ్రద్ధతో, సందేశాన్ని ఇస్తున్న శ్రీ కృష్ణుని పట్ల అసూయ లేకుండా ఆదేశము తమకు తగదని భావింపక శాయశక్తులా పాటించుటకు కృషి చేయవలెను. ఆ విధముగా కష్ట నష్టాలను లెక్క చేయక సహనంతో కొనసాగినట్లైతే వారు తప్పక కృష్ణచైతన్యానికి ఉద్దరించబడుతారు.

….పరమపూజ్యశ్రీ శ్రీమత్‌ ఎ సి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్‌ హైదరాబాద్‌ వారి సౌజన్యంతో …..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *