Lucky draw | బెయిల్……

Lucky draw | బెయిల్……

Lucky draw | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చింది. గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. సంక్రాంతి లక్కీడ్రా కేసులో అంబటి రాంబాబుకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతంలో చంద్రబాబును దూషించిన కేసుతో పాటు మరికొన్ని కేసుల్లో రిమాండ్ కు వెళ్లగా.. బెయిల్ వచ్చిన సంగతి తెలిసిందే.

అయితే మళ్లీ లక్కీడ్రా కేసులో రిమాండ్ కు వెళ్లగా… గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. అంబటి రాంబాబును విచారించేందుకు తమకు కస్టడీకి అప్పగించాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్‌ను జడ్జి కొట్టివేశారు. ఈ కేసులో కస్టడీ అవసరం లేదని అభిప్రాయపడిన న్యాయస్థానం, పోలీసుల అభ్యర్థనను తోసిపుచ్చింది. మరోవైపు అంబటి తరపు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై వాదనలు విన్న అనంతరం కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Leave a Reply