అన్నదాతలకు నష్టం..

అన్నదాతలకు నష్టం..

మోత్కూర్, (ఆంధ్రప్రభ)
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపల్ కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో ఈ రోజు ఉదయం నుండి కురుస్తున్న మోస్తరు వర్షంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఓ పక్క మొoథా తుఫాన్ తో ధాన్యం, పత్తి పంటలు తడిసి రైతులు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా… మరో వైపు కురుస్తున్న మోస్తారు వర్షంతో మూలిగే నక్క పై తాటి పండు అన్న చందంగా మారింది రైతన్నల పరిస్థితి. ఈ సంవత్సరం వర్షాలు తమను నిండా ముంచుతున్నాయని, తమకు చాలా కష్టంగా మారిందని రైతులు కన్నీటి పర్యంతమౌతున్నారు.

కోతకు వచ్చిన పొలాలు కోద్దామంటే వర్షాలు పడుతుండడంతో చైన్ మిషన్లు సైతం పెట్రోల్ బంక్ ల వద్ద పెట్టి నిరీక్షిస్తున్నారు. వర్షాలతో కొనుగోలు కేంద్రాలు సైతం బోసిపోతున్నాయి. నిత్యం వర్షాలతో పత్తి ఏరడం కూడా ఇబ్బందిగా మారిందని.. దీంతో చేను మీదే పత్తి తడిసి ముద్ద అవుతుందని రైతులు వాపోతున్నారు. తేమ శాతం రాకపోవడంతో ధాన్యపు రాశుల పై టార్పాలిన్ లు కప్పి వేచి చూడడం తప్పా ఏమీ చేయలేకపోవుతున్నామని ఇటు రైతులు.. అటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, అధికారులు వాపోతున్నారు.

Leave a Reply