వాగులో కొట్టుకుపోయిన లారీ

వాగులో కొట్టుకుపోయిన లారీ

అశ్వారావుపేట, ఆంధ్ర‌ప్ర‌భ : భారీ వర్షాలకు ఖమ్మం జిల్లా(Khammam District)లోని పల్లిపాడు – ఏన్కూరు మ‌ధ్య జ‌న్నారం వాగు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తోంది. ఈ వాగులో అశ్వారావుపేట కు చెందిన వ్యాను కొట్టుకుపోయింది. ఈ వ్యాన్ డ్రైవ‌ర్ గ‌ల్లంత‌య్యాడు. మండలంలోని నారంవారి గూడెం గ్రామానికి చెందిన వెంకట ముత్యం (పెద్దోడు) కు చెందిన వ్యాన్‌ జూలూరుపాడు కి పత్తి లోడింగ్ తో వెళుతుంది.

మార్గ మ‌ధ్యంలో ఉన్న జిన్నారం వాగు వ‌ర‌ద ఉధృతిలో వ్యాన్ కొట్టుకుపోయింది. డ్రైవర్ మురళి(Driver Murali) వ్యాన్ కొట్టుకుపోకుండా కొద్దిసేపు నియంత్రించినా ఆ తర్వాత వరద ఉధృతి తీవ్రంగా పెరగడంతో వ్యాను కొట్టుకుపోయింది. దీంతో నీటిలో ప‌డిన డ్రైవ‌ర్ ముర‌ళీ వ‌ర‌ద నీటిలో గ‌ల్లంత‌య్యాడు. ముర‌ళీ కోసం గ్రామ‌స్థులు, పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply