లారీ ఢీకొని ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం

లారీ ఢీకొని ఇద్ద‌రి దుర్మ‌ర‌ణం

ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : నల్లగొండ జిల్లా(Nalgonda District) దేవరకొండ పట్టణ సమీపంలో ఈ రోజు సాయంత్రం బైక్‌ను లారీ ఢీకొంది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై ప్ర‌యాణం చేస్తున్న ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం పాల‌య్యారు. కొండ భీమనపల్లి సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వద్ద దేవరకొండ నుండి చారగొండకు మోటార్ సైకిల్(Motorcycle) పై యువకుడు, మహిళ వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ దుర్ఘ‌ట‌న‌లో వారిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

మృతుల వివరాలు పూర్తిగా తెలియ రాలేదు. మృతి చెందిన ఇద్దరిదీ నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ గ్రామంగా సమాచారం. దేవరకొండ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృత‌దేహాల‌ను పోస్టుమార్టం నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply