ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ప్రైవేట్ స్కూల్ బస్సు కింద పడి చిన్నారి మృతిచెందిన ఘటన తెలంగాణలోని నల్లగొండ (Nalgonda) జిల్లాలో చోటుచేసుకుంది. నల్లగొండ పట్టణంలోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఎల్ కేజీ చదువుతున్న చిన్నారి జశ్విత (4) ఆ ప్రమాదంలో మృతిచెందింది. ఈ ఘటన ఘటన గురువారం నల్లగొండ పట్టణంలోని దుప్పలపల్లి (Duppalapalli) రోడ్డులో జరిగింది.

గ్రామం నుండి స్కూల్ బస్సులో పాఠశాల (School) వద్దకు వచ్చిన చిన్నారి బస్సు దిగుతున్న సమయంలో డ్రైవర్ చూసుకోకుండా బస్సును కదిలించడంతో జశ్విత టైర్ల కింద పడి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు బాలికను చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లగా, పరీక్షించిన వైద్యులు (Doctors) చిన్నారి అప్పటికే మృతి చెందిందని నిర్ధారించారు. చిన్నారి మరణంతో బాలిక కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply