వైరా వైన్ షాపుల్లో దొరకని బీర్…

వైరా వైన్ షాపుల్లో దొరకని బీర్…
- కృత్రిమ కొరత సృష్టిస్తున్న మద్యం సిండికేట్
- బెల్టు షాపుల్లో, బార్ అండ్ రెస్టారెంట్ ల్లో
- ఎమ్మార్పీ పై 50 రూపాయల అధిక ధరకు బీర్ విక్రయం
- చోద్యం చూస్తున్న వైరా ఎక్సైజ్ శాఖ అధికారులు
వైరా,ఆంధ్రప్రభ : అసలే వేసవికాలం.. మద్యం ప్రియులు లిక్కర్ ను పక్కనపెట్టి బీర్ ను సేవించేందుకు ఆసక్తి చూపుతుంటారు. వారి ఉత్సాహాన్ని ఆసక్తిని.. సోము చేసుకునేందుకు మద్యం సిండికేట్ వ్యాపారులు బీరుకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. వైరా పట్టణంలో మండలంలోని వైన్ షాపుల్లో.. బీరు కావాలని అడిగినా మద్యం ప్రియులకు చుక్కెదురు అవుతుంది. 80 శాతంకు పైగా మద్యం ప్రియులు వేసవికాలంలో ఇష్టంగా సేవించే బీర్లు వైన్ షాపుల్లో కనపడటం లేదు. దీనికి కారణం.. సిండికేట్ వ్యాపారుల అక్రమ లాభార్జన అధిక ధరల విక్రయం. వారు సొమ్ము చేసుకునేందుకు బెల్ట్ షాపుల్లో ఆ బ్రాండ్ కు సంబంధించిన ఆసక్తి కనపరిచే బీర్లు ఏరులై పారుతుంటాయి.
అక్కడ ధర మాత్రం ఎంఆర్పి ధర కంటే 50 రూపాయలు ఎక్కువ… తప్పని పరిస్థితుల్లో వేసవికాలంలో చల్లదనం ఉన్న బీర్లు అధిక ధర అయినప్పటికీ విక్రయిస్తూన్నారు. వైరా మున్సిపాలిటీ తోపాటు వైరా మండలంలోని ఐదు వైన్ షాపులు ఒక పారం రెస్టారెంట్ సిండికేట్ గా ఏర్పడి.. అక్రమ వ్యాపారానికి శ్రీకారం చుట్టి… మందు బాబుల జేబుకు చిల్లు పెడుతున్నారు… ఏ వైన్ షాపుల్లో అడిగినా… అతిథిగం శాతం మద్యం ప్రియులు వినియోగించే బ్రాండ్ కు సంబంధించి బీర్లు దొరకకపోవడం కొంతమంది విచిత్రంగా భావిస్తున్నారు… మద్యం సిండికేట్ వ్యాపారుల జిమ్మిక్కులను… చూస్తూ ఎక్సైజ్ శాఖ వైరా అధికారులు సిబ్బంది తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించడం పై తీవ్ర స్థాయి విమర్శలు వినిపిస్తున్నాయి.
సిండికేట్ వ్యాపారుల చేతిలో ఎక్సైజ్ అధికారులు కీలుబొమ్మలుగా వ్యవహరిస్తున్నట్లు పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి.. కేవలం సిండికేట్ వ్యాపారులు నెలవారి ఇచ్చే మామూళ్ల మత్తులో.. తూగుతూ.. ఆ శాఖకి అప్రతిష్ట తెస్తున్నట్లు తెలుస్తోంది. లైట్ బీరు ధర 170, స్ట్రాంగ్ బీరు 180 ఎమ్మార్పీ ఉంటే బెల్టు తోపాటు బార్ అండ్ రెస్టారెంట్ లో.. 50 రూపాయలు అధికంగా విక్రయాలు జరుగుతున్నప్పటికీ… ఎక్సైజ్ అధికారులు నమ్మక నీరు ఎత్తినట్లు వ్యవహరించడం… ప్రస్తుతం చర్చ నీ అంశంగా మారింది… ఖమ్మం జిల్లా స్థాయి అధికారులు.. వైరా సిండికేట్ పై దృష్టి సారించి… బెల్ట్ షాపుల్లో.. అధిక ధరల విక్రయానికి అడ్డుకట్ట వేయాలని… వైన్ షాపుల్లో సిండికేట్ వ్యాపారులు అక్రమ లాభార్జన కోసం.. బీరు పై కృత్రిమ కొరతను కట్టడి చేయాలని మద్యం ప్రియులు కోరుకుంటున్నారు.
