14 గేట్ల ఎత్తివేత‌

మిర్యాల‌గూడ‌, ఆంధ్ర‌ప్ర‌భ : నాగార్జున సాగ‌ర్(Nagarjuna Sagar) జ‌లాశ‌యం నిండుకుండలా మారింది. దీంతో అధికారులు అప్ర‌మ‌త్త‌మై ప్రాజెక్టు క్ర‌స్ట్ గేట్ల‌ను మ‌రోసారి ఈ రోజు ఎత్తి వేసి కింద‌కు 82,986 క్యూసెక్కుల(Cusekkula) నీరు విడిచి పెడుతున్నారు.

14 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌(Nagarjuna Sagar)లోకి 1,67,702 క్యూసెక్కులు వస్తుండగా, అంతే మొత్తంలో వదులుతున్నారు. కుడి కాల్వకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాల్వకు 8,454 క్యూసెక్కులు, పవర్ హౌస్ కు 33,942 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

జలాశయం(Reservoir) పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.80 అడుగులకు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 311.447 టీఎంసీలు(TMCs)గా నమోదైంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

Leave a Reply