వేగం కంటే ప్రాణాలే ముఖ్యం..

  • మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు.
  • ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే, సురక్షితం
  • వరంగల్ డిటిసి సురేష్ రెడ్డి
  • రోడ్డు, భద్రత, వినియోగదారుల హక్కుల పోస్టర్ రీలీజ్

వరంగల్ సిటీబ్యూరో, ఆంధ్రప్రభ : మానవ తప్పిదాలు,పోరబాట్ల వల్లనే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని వరంగల్ డిటిసి సురేష్ రెడ్డి తెగేసి చెప్పారు. రోడ్డు ప్రమాదాల కారణంగా అమాయకులు ప్రాణాలు కొల్పియి, ఆయా కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

వేగం కంటే మనుష్యుల ప్రాణాలే ముఖ్యమని గుర్తించి డ్రైవింగ్ చేస్తే సురక్షితంగా గమ్యం చేరుకోవచ్చునని డిటిసి సురేష్ రెడ్డి సూచించారు. వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన రోడ్డు-భద్రత, వినియోగదారుల హక్కులకు సంబంధించిన పోస్టర్ ను వరంగల్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ సురేష్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు.

గత ఆరునెలలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోవడం,అమాయకులు ప్రాణాలు పోగొట్టు కుంటున్న తరుణంలో వినియోగదారుల మండలి రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు భద్రతపై చైతన్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది.అలాగే రోడ్డు భద్రతకు అనుసరించాల్సిన సరైన పద్ధతులు,విధానాలు ఆవలంబించాల్సిన తీరుతెన్నులపై అవగాహన కల్పించే ప్రయత్నాలు ప్రారంభించారు.

అలాగే రోడ్డు ప్రమాదాల నివారణ అమలు కొరకు,వివిధ అంశాలపై రోడ్డు భద్రత సర్వేను మంగళవారం నుండి మొదలు పెట్టారు. సర్వే ప్రారంభం రోజున వరంగల్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ సురేష్ రెడ్డి వినియోగదారుల చైతన్యానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసారు. అనంతరం డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమీషనర్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ, వాహన వినియోగదారులు అతి వేగం కారణంగా వాహనాలను నియత్రించక పోవడం వల్లే రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు.

స్పీడ్ థ్రిల్ బట్ కిల్స్ అని గుర్తించి నియమిత వేగంతోనే డ్రైవింగ్ చేయాలన్నారు, యువత ముఖ్యంగా మద్యం అలవాట్లతో విచక్షణ,వివేకం కొల్పియి స్పీడ్ గా వాహనాలు నడుపుతూ నూరేళ్ళ జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారని ఆందోళన వెలుబుచ్చారు.

మత్తు పదార్థాలు దూరంగా ఉండాలని కోరారు. అలాగే సీటు బెల్టు తో డ్రైవింగ్ వల్ల ప్రాణాపాయం తప్పుతుందని డిటిసి సురేష్ రెడ్డి గుర్తు చేశారు.వాహనాలు కొనుగోళ్ళలో కూడా వినియోగదారులు చైతన్య వంతులు కావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ద్వి చక్ర వాహనదారులు రోడ్లపై భారీ వాహనాలకు వీలయినంత ఎక్కువ దూరంలో డ్రైవింగ్ చేయాలని డిటిసి సూచించారు.

వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, దక్షిణాది రాష్ట్రాల వినియోగదారుల సమన్వయ కమిటీ సెక్రటరీ జనరల్ మొగిలి చర్ల సుదర్శన్ ల ఆధ్వర్యంలో మంగళవారం నుండి మూడు నెలలు (31 జనవరి 2026 వరకు) తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు భద్రత పై సర్వే కొనసాగుతుందని సాంబరాజు చక్రపాణి తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిసిఐ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రావుల రంజిత్ కుమార్, హన్మకొండ జిల్లా ఉపాధ్యక్షుడు ఆది శేషు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply