గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి..
చేవెళ్ల, ఆంధ్రప్రభ : గ్రంథాలయ నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని చేవెళ్ల శాసన సభ్యులు కాలె యాదయ్య(Kale Yadayya), జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ.మధుసూదన్ రెడ్డిలు స్పష్టం చేశారు. చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలో రూ. రెండు కోట్లతో డిజిటల్ గ్రంథాలయ నిర్మాణం జరుగుతుందన్నారు. డిజిటల్ గ్రంథాలయ నిర్మాణాన్ని స్థానిక నేతలతో కలిసి ఈ రోజు పరిశీలించారు. సంబంధిత అధికారులకు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు పలు సూచనలు, సలహాలు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తహశీల్దార్ కార్యాలయ రోడ్డుకు గ్రంథాలయం ముందు వ్యాపార వాణిజ్య సముదాయ సెట్టర్స్ నిర్మాణం చేయడం జరుగుతుంద న్నారు. చేవెళ్ల ప్రాంత ప్రజలకు మెరుగైన డిజిటల్ గ్రంథాలయ(Digital Library) సేవలు త్వరలో అందనున్నాయని తెలిపారు. గ్రంథపాఠకులు గ్రంథాలయంను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
గ్రంథ పఠనంతో విజ్ఞానం, మేధోసంపతి పెరుగుతుందన్నారు. విద్యార్థులకు, యువకులకు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి ఈ డిజిటల్ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్లు దేవర వెంకటరెడ్డి(Devara Venkata Reddy), గోనె ప్రతాపరెడ్డి, తహశీల్దార్ కృష్ణయ్య, పీఏసీఎస్ మాజీ చైర్మన్ ఎస్. బల్వంత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి మాలతి కృష్ణారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాండు, మున్సిపల్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ గుండాల రాములు(Former MPTC Gundala Ramulu), యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కార్తీక్ రెడ్డి, మాజీ అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్, సర్పంచులు మధుసూదన్ గుప్తా, గోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రాజశేఖర్, పాండు, పి ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

