ఇంటిల్లిపాది కలసి భోజనం చేద్దాం
- సమతుల్య ఆహారం మంచిది
- యోగా చేద్దాం.. రోగాన్నితరుముదాం
- కర్నూలు జిల్లా ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య
కర్నూలు, ప్రతినిధి, ఆంధ్రప్రభ : మహిళల ఆరోగ్య పరిరక్షణతోనే కుటుంబాల బలోపేతం సాధ్యమవుతుందని ఇంచార్జి కలెక్టర్ డాక్టర్ బీ.నవ్య(Collector Dr. B. Navya) అన్నారు. కర్నూలులోని ఏ క్యాంప్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం( Primary Health Center)లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వస్త్ నారీ సశక్త్ పరివార్(Swast Nari Sashakt Parivar) అభియాన్ మాసోత్సవాలు, 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి స్త్రీ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ప్రధానమంత్రి(Prime Minister) స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నామని … 8వ రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమాలను చేపట్టామన్నారు. స్త్రీ ఆరోగ్యంగా ఉండడం ఎంత ముఖ్యమని(Important) కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాలను క్యాంపెయిన్ మోడ్ లో ప్రారంభించినట్టు ఇన్ చార్జి కలెక్టర్ వివరించారు.
- అమ్మతో కలసి భోజనం చేద్దాం
మన ఇంట్లో అందరూ తిన్న తర్వాతే అమ్మ భోజనం చేయడం అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటామని, అది కరెక్ట్ కాదని అందరూ కలిసి భోజనం చేయాలన్నారు. అమ్మల ఆరోగ్యనికి( Health of Mothers) ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తూ అందుకు పెద్ద పీట వేస్తూ ఈ కార్యక్రమాన్నిప్రభుత్వం ప్రారంభించిందని ఇన్ చార్జి కలెక్టర్ అన్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే మన జీవనశైలి విధానం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ద్వారా కూడా కొంత హెల్తీగా ఉండే పరిస్థితి ఉంటుందన్నారు.. ముఖ్యంగా పోషక విలువలు(Nutritional Values) ఉన్నఆహారం తీసుకోవాలి అనే విషయం పై ఎక్కువ శ్రద్ధ వహించాలన్నారు.
సమతుల్య ఆహారం బెస్ట్
మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైస్ ఎక్కువ తింటామని, ప్రోటీన్ కంపోనేంట్(Protein Component) లు చాలా తక్కువ ఉంటుందన్నారు. పప్పులు, మిల్లెట్స్, రాగులు, సజ్జలు, కొర్రలు పప్పు దినుసులు లాంటివి మన ఆహారంలో ఎక్కువ శాతం మనం తీసుకునే విధంగా ప్రజలలో అవగాహన వచ్చిందన్నారు.. ముడి పదార్థాలు, కార్బోహైడ్రేట్లు(Carbohydrates) లాంటివి వినియోగం తగ్గించాలని ఇన్ చార్జి కలెక్టర్ వివరించారు. కార్బోహైడ్రేట్లు వినియోగంతో ఓబీసీటీ సమస్య పెరుగుతుందన్నారు. సమతుల్య ఆహారాన్నిజీవన శైలి(Lifestyle)లో ఒక భాగంగా చేసుకోవాలన్నారు.. పిల్లలకి చిన్నప్పటినుంచి ఈ జీవన శైలిని అలవాటు చేయాలన్నారు..
- యోగాతో బీపీ ఫటాఫట్
కొర్రలు, సజ్జలుతో ఆహార పదార్థాలు చేసి పిల్లలకి తినిపిస్తే మంచిగా పోషక విలువలు ఉన్న సమతుల్యమైన ఆహారం పిల్లలకి అందుతుందన్నారు. పిల్లలకి తప్పనిసరిగా ప్రోటీన్ బేస్ డైట్(Protein Base Diet) ఇవ్వటం చాలా ముఖ్యమన్నారు. ఒత్తిడి, ఆందోళన వల్ల బీపీ అనేది ఎక్కువ వస్తుందన్నారు. బీపీతో గుండె సంబంధిత సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. మహిళలలో ఎక్కువగా మెనోపాస్ టైంకి ఎముకలు బలహీనత పడి నడవడం కష్టంగా ఉండడం లాంటివి చూస్తూ ఉంటామన్నారు.
వీటన్నిటిని అధిగమించడానికి మానవ జీవన శైలిలో యోగాన్నిఒక విధానం కింద మార్చుకోవాలన్నారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ ప్రకారం నేర్చుకున్నయోగా కార్యక్రమాలను నిత్యం కొంత సమయం ఒత్తిడి, ఆందోళనకు సంబంధించి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. యోగ చేయడం ద్వారా చదువుకునే పిల్లల్లో ఏకాగ్రత దృష్టి పెరుగుతుందన్నారు. అదే విధంగా వాకింగ్ కూడా రోజుకు అరగంట చేసిన ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయన్నారు..
- గర్భిణీలూ జర భద్రం
గర్భవతుల ఆరోగ్యం మీద రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెడతారన్నారు. టేక్ హోమ్ రేషన్ కిట్లు, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ను వారికి అందచేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారన్నారు. టేక్ హోమ్ రేషన్ కిట్లలో ఇచ్చే ప్రతి పదార్థం కూడా దాంట్లో పోషక విలువలు అన్నీ కూడా ప్రెగ్నెంట్ మహిళ కి అవసరమైనవన్నారు.
గర్భవతులు వాటిని తినడం చాలా అవసరమని అప్పుడే కడుపులో ఉన్నబిడ్డ ఎదుగుదల బాగుంటుంది, ప్రాపర్ గా మంచి వెయిట్ తో బేబీ డెలివరీ జరుగుతుందన్నారు. పోషణ్ మాహ్ కార్యక్రమాలు సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 16 వరకు నెల రోజులు వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ (మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేక వైద్య శిబిరాలు) స్క్రీనింగ్ ప్రోగ్రాం(Screening Program) కూడా సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వ తేది వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు.
ప్రతి ఒక మహిళ కూడా స్క్రీనింగ్ పరీక్షలను చేయించుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ మహిళలకు సూచించారు. రొమ్ము క్యాన్సర్ యుటరస్ క్యాన్సర్ ఇది మహిళల్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి అప్పుడప్పుడు చెకప్ చేయించుకోవాలని ఇంచార్జ్ కలెక్టర్ మహిళలకి సూచించారు.
అనంతరం ఇంచార్జి కలెక్టర్ గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం, చిన్నపిల్లలకి అన్నప్రాశన కార్యక్రమం నిర్వహించారు. అక్కడే ఏర్పాటు చేసిన అంగన్వాడి స్టాల్ ను పరిశీలించారు. స్క్రీనింగ్ పరీక్షలకు సంబంధించిన వాటిని బ్లడ్ డొనేషన్(Blood Donation) కార్యక్రమాలను ఇంచార్జి కలెక్టర్ ప్రారంభించారు. కార్యక్రమంలో స్టేట్ నోడల్ అధికారులు రామనాథం, డా.నరేష్,ఐసీడీఎస్ పీడీ విజయ, డీఎంహెచ్ఓ డా. శాంతి కళా, డీసీహెచ్ఎస్ డా.జాఫ్రుల్లా, డీఐఓ డా.నాగప్రసాద్, కార్పొరేటర్ పద్మలత తదితరులు పాల్గొన్నారు..




