తిరుపతి వేదిక్ వర్సిటీలో ప్రత్యక్ష్యం

(తిరుపతిరూరల్, ఆంధ్రప్రభ ): తిరుపతి (Tirupati) లోని శ్రీ వెంకటేశ్వర వేదిక యూనివర్సిటీలో చిరుత పులి సంచారం కలకలం రేపుతుంది ఆదివారం అర్ధరాత్రి సమీప అటవీ ప్రాంతం నుంచి వేదిక్ యూనివర్సిటీలోని పరిపాలన భవనం సమీపంలో సంచరిస్తూ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు కనిపించింది ఈ దృశ్యాన్ని అక్కడ పని చేస్తున్న ఉద్యోగులు తమ సెల్ ఫోన్ లో బంధించారు భయభ్రాంతులకు గురైన ఉద్యోగులు పరుగులు పెడుతూ లోనికి వెళ్లి తలుపులు వేసుకున్నారు ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకుని అటవీ శాఖ సిబ్బంది శబ్దాలు చేయడంతో చిరుత పులి సమీప అటవీ ప్రాంతంలోనికి వెళ్లిపోయింది అయితే గత వారం రోజులుగా చిరుతపులి (leopard) శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం మరియు వేదిక్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ విద్యార్థులను ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తుంది వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత సంచారంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమై బోనులు ఏర్పాటు చేశారు అయినా వాటిని తప్పించుకొని జీవితపులులు యూనివర్సిటీలలో తిరుగుతూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి విద్యార్థులు ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు అవసరమైనచోట బోనులు ఏర్పాటు చేయనున్నట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply