Leopard | నీటి కోసం గ్రామంలోకి వచ్చిన వన్యప్రాణి

Leopard | నీటి కోసం గ్రామంలోకి వచ్చిన వన్యప్రాణి
Leopard | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కడప జిల్లాలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నీటి కోసం గ్రామంలోకి వచ్చిన చిరుతపులిపై కుక్కల గుంపు దాడి చేయడంతో అది మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లా చిన్నబాకరపురం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎండాకాలం కారణంగా నీటి కోసం జనావాసాల్లోకి వచ్చిన చిరుతపులిపై స్థానిక కుక్కల గుంపు దాడి చేసింది.
ఈ దాడిలో చిరుత తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వేసవి కాలంలో నీటి కొరత కారణంగా వన్యప్రాణులు గ్రామాల్లోకి రావడం సాధారణమైందని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని చనిపోయిన చిరుతను వీక్షించారు. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
