Legal Service | పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించాలి….

Legal Service | పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించాలి….

Legal Service | బిక్కనూర్, ఆంధ్రప్రభ : పేద ప్రజలకు ఉచిత న్యాయ సేవలు అందించాలని సిద్ధిరామేశ్వర ఆలయ పీఠాధిపతి సదాశివ మహంతు సూచించారు. సోమవారం బిక్కనూరు మండల కేంద్రంలో న్యాయవాది దాసరి నాగరాజు ఆధ్వర్యంలో లీగల్ సర్వీస్ సెంటర్(Legal Service Centre) ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా దానిని ఆలయ పీఠాధిపతి చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… నేటి సమాజంలో ఎంతో మంది పేదలు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారికి న్యాయపరంగా సేవలు అందించవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. న్యాయం(Justice) కోసం వచ్చేవారికి సకాలంలో న్యాయ సేవలు అందించాలని తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు గజ్జల బిక్షపతి, రత్నాకర్ రావు, హరిహరపుత్ర అయ్యప్ప ఆలయ ప్రధాన పూజారి శివం పంతులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply