Leaders of BRS | మల్లక్కపేట్ లో బీఆర్ఎస్ విస్తృత ప్రచారం
Leaders of BRS | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల మండలంలోని మల్లక్కపేట్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దొమ్మటి ఇందిరా రమేష్ గెలుపునకు మద్దతుగా ఇంటింటి ప్రచారం జోరుగా సాగింది. ఈ సందర్భంగా మల్లక్కపేట్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దొమ్మటి ఇందిరా రమేష్ గ్రామాభివృద్ధి పట్ల కట్టుబడి ఉన్న వ్యక్తి అని పేర్కొంటూ, కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామస్తులను కోరారు. గ్రామ అభివృద్ధి, ప్రాథమిక సౌకర్యాల మెరుగుదల కోసం ప్రజలు ఏకమై అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు ఇంటింటి ప్రచారంలో పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అభ్యర్థి దొమ్మటి ఇందిరా రమేష్, మల్లక్కపేట్ గ్రామ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

