Lavanya | ఆశతో కాదు.. ఆశయంతో వస్తున్న
- అభివృద్ధిని చేతలతో చూపిస్తా
- గ్రామ సర్పంచ్ అభ్యర్థిని గోదారి లావణ్య (విజయ్)
Lavanya | జైపూర్, ఆంధ్రప్రభ : నీతి, నిజాయితీగా.. ధర్మబద్ధంగా నర్వ గ్రామాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేస్తానని, ఒకసారి అవకాశం ఇచ్చి తనను సర్పంచ్ గా భారీ మెజారిటీతో గెలిపించాలని గోదారి లావణ్య ( విజయ్) విజ్ఞప్తి చేశారు. నర్వ గ్రామాన్ని ఉత్తమ గ్రామంగా తీర్చి దిద్దుతానన్నారు. భర్త చాటు భార్యగా కాకుండా, స్వతంత్ర మహిళగా పరిపాలన అందిస్తానన్నారు. మీ ఆడబిడ్డగా ముందుకు వచ్చానని, ఆశీర్వదించి తనను గెలిపించాలని కోరారు. నిరంతరం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ సేవకురాలిగా పని చేస్తానన్నారు. అవినీతి, మధ్య వర్తిత్వం లేకుండా ఉంటానని తెలిపారు. గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. రైతులకు, పేదలకు అండగా నిలుస్తానని చెప్పారు. పాలకురాలిగా కాకుండా ప్రజా సేవకురాలిగా పని చేస్తానని గోదారి లావణ్య స్పష్టం చేశారు.

