Forest | గుప్త నిధుల కోసమేనా?

గుప్త నిధుల కోసమేనా?

అర్థరాత్రి అడవుల్లో తవ్వకాలు

అధికారులం అంటూ జేసీబీతో భారీ గుంత‌లు
అడ్డుకొని ప్రశ్నించిన సీతానగరం గ్రామ యువకులు

గూడూరు, ఆంధ్రప్రభ : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం అటవీ ప్రాంతాలలో అర్థరాత్రి తవ్వకాలు కలకలం రేపింది. రెండు కార్లు ఒక ద్విచక్ర వాహనం, ఒక జేసీబీతో గుర్తుతెలియని కొంతమంది వ్యక్తులు అర్ధరాత్రి అటవీ ప్రాంతాలలో తవ్వకాలను ప్రారంభించారు. రెండు దిక్కుల నాలుగు నుంచి ఎనిమిది ఫీట్ల లోతు వరకు తవ్వి వదిలిపెట్టి నేషనల్ 360 హైవే రోడ్డు సమీపంలో మరో మారు తవ్వకాలు జ‌రుగుతున్న సమయంలో సీతానగరం గ్రామపంచాయతీ భూక్యతృ తండాకు చెందిన కొంతమంది యువకులు అడ్డుకున్నారు.

మేము అధికారులం ఇక్కడినుంచి బియ్యం లారీ వెళుతుందని సమాచారంతో ఇక్కడ నిలబడ్డాం అని సమాధానం ఇవ్వగ నిజమే అనుకున్నారు ఆ యువకులు. కానీ అడవి ప్రాంతంలో జేసీబీ సహాయంతో తవ్వకాలను జరుపుతుంటే చూసి అవాక్క‌య్యారు. అధికారులైతే అడ‌వి ప్రాంతంలో జేసీబీతో త‌వ్వాల్సిన అవ‌స‌రం ఏముంద‌నే అనుమానం వ‌చ్చి గట్టిగా ప్రశ్నించగా ఆ వ్యక్తులు తడబడ్డారు. ఈ విషయంపై స్థానిక అటవీ శాఖ, పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయగా అటవీశాఖ అధికారులు వచ్చేలోపు ఆ వ్యక్తులు పరారయ్యారు. అటవీ ప్రాంతంలో జరిపిన తవ్వకాలను చూసి అధికారులు షాక్ అయ్యారు. ఈ తవ్వకాలు ఎందుకు చేశారో దేనికి కోసం చేశారా అనే సందిగ్ధంలో పడ్డారు. దాదాపు గుప్త నిధుల తవ్వకాలే కోసమని ఇది గుప్త నిధుల కోసం ఇచ్చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తవ్వకాలకు సంబంధించిన పూర్తి విషయాలు పూర్తి సమాచారంతో వెల్లడిస్తామని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Leave a Reply