అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన సీఎం
బోనాలు సమర్పించిన మంత్రి సురేఖ
హైదరాబాద్, ఆంధ్రప్రభ : సికింద్రాబాద్ లష్కర్ బోనాలు (Lashkar bonalu ) జాతర సందర్భంగా శ్రీఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి (ujjaini mahankali ammavari temple ) సీఎం రేవంత్ రెడ్డి (cm revanth reddy ) పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మంత్రి కొండా సురేఖతో కలిసి అమ్మవారికి బోనం సమర్పించారు. ఉదయం 11.00 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలయానికి చేరుకున్నారు. సీఎంకు ఆలయ మర్యాదాలతో పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోకి తీసుకు వెళ్లారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు అనంతరం పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి దంపతులు అందజేశారు. సీఎం వెంట పాల్గొన్న రాష్ట్ర దేవదాయశాఖ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ కూడా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి కొండా సురేఖకు ఆలయ మర్యాదాలు, పూర్ణకుంభంతో అర్చకులు స్వాగతం పలికారు.