Lakshmi | గెలిపించండి అభివృద్ధి చేస్తా…

Lakshmi | గెలిపించండి అభివృద్ధి చేస్తా…

సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ నాగరాజు..

Lakshmi | ధర్మసాగర్, ఆంధ్రప్రభ : గ్రామాన్ని అభివృద్ధి చేస్తా… ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండిని సర్పంచ్ అభ్యర్థి అడాలి లక్ష్మీ కోరారు. ఈనెల 14వ తేదీన జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో ఓటేసి గెలిపించాలని సాయిపేట గ్రామపంచాయతీ వీధుల్లో ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ బలపరచిన సర్పంచ్ అభ్యర్థి అడాలి లక్ష్మీ నాగరాజు ప్రచారాన్ని చేపట్టారు.

గ్రామ ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల బరిలో ఉన్నానని పేర్కొన్నారు సర్పంచ్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రజా సమస్యలను స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి సహకారంతో ఎప్పటికప్పుడు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పనులు కడియం శ్రీహరి నేతృత్వంలో గ్రామానికి తీసుకొస్తాన‌న్నారు. భవిష్యత్తులో గ్రామాన్ని మరింత అభివృద్ధి బాటలో ముందుకు తీసుకెళ్తానని, అభివృద్ధికి ఓటేయాలని కోరారు.

Leave a Reply