(అనంతపురం బ్యూరో , ఆంధ్ర ప్రభ) : అనంతపురం (Anantapur ) లో ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు విద్యార్థిని స్వాతి (22) ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) పెనుకొండకు చెందిన స్వాతి అనంతపురం సాయినగర్ లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ల్యాబ్ టెక్నీషియన్ (Lab Technician) కోర్సు చేస్తోంది.
సోమవారం తెల్లవారుజామున ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. తోటి విద్యార్థులు స్వాతి (Swathi) ని హుటాహుటిన అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా ఆమె ప్రాణాలు గాల్లో కలసి పోయాయి. స్వాతి ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.