అదరించండి అభివృద్ధి చూపిస్తా..

అదరించండి అభివృద్ధి చూపిస్తా..
- గడ్డం రజిత రవీందర్
క్యాతన్ పల్లి, ఆంధ్రప్రభ : నిజాయితీ,సమస్యలు పరిష్కరించాలనే తపన,ప్రజలకు నిస్వార్థంగా సేవ చేయాలనే లక్ష్యంతో వస్తున్న తనను ఆదరించాలని బిఆర్ఎస్ 5 వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం రజిత రవీందర్ లు కోరారు.గురువారం అమరవాది గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించి ఓటర్ మహాశయులను బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.గ్రామాభివృద్దే దేయంగా గ్రామంలో రోడ్లు,డ్రైనేజీలు,విద్యుత్ దీపాలు ఇతర మౌలిక వసతుల అధిక ప్రాధాన్యత ఇస్తానని గ్రామ అభివృద్ధి కి కృషి చేస్తానని అన్నారు.
