జూడో క్రీడాకారిణి కల్పనకు కర్నూలు ఎస్పీ అభినందనలు

జూడో క్రీడాకారిణి కల్పనకు కర్నూలు ఎస్పీ అభినందనలు

కర్నూలు బ్యూరో, ఆంధ్ర ప్రభ : జాతీయ పోలీసు జూడో క్లస్టర్(Judo Cluster) ఆటల పోటీల్లో వెండి , కాంస్యం పథకాలు సాధించిన కర్నూలు సాయుధ రిజర్వుడు ఆర్ ఎస్సై పి. కల్పన ను బుధవారం జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అభినందించారు .

2025 అక్టోబర్ 8వ తేదీ నుంచి అక్టోబర్ 16 వరకు జమ్మూ & కాశ్మీర్ రాష్ట్రం(Kashmir State)లో జరిగిన 10 వ జాతీయ పోలీసు జూడో క్లస్టర్ ఆటల పోటీల్లో ఆంద్రప్రదేశ్ తరపున కర్నూలు జిల్లా పోలీసుశాఖ నుండి ఆర్ ఎస్సై కల్పన పాల్గొన్నారు. పెన్కాక్ సిలాట్(Pencak Silat)లో ఒక వెండి పతకం, కరాటే లో కాంస్య పతకాన్ని ఆర్ ఎస్సై కల్పన సాధించారు.

Leave a Reply