Kuno Park | ఒకే కాన్పులో 3 పిల్ల‌లు

Kuno Park | ఒకే కాన్పులో 3 పిల్ల‌లు

Kuno Park | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : కునో జాతీయ పార్కులో దక్షిణాఫ్రికా నుంచి తెచ్చిన ‘గామిని’ అనే చిరుత మూడు కూనలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తెలిపారు. దీంతో దేశంలో చీతాల సంఖ్య 38కి చేరింది. ఈనెల ప్రారంభంలో నమీబియా నుంచి వచ్చిన ‘ఆశా’ అనే చీతా కూడా ఐదు కూనలకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే .

చీతాల సంతతిని పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్‌ చీతా’ను చేపట్టింది. ఈ విజయానికి కృషి చేస్తున్న సిబ్బందిని మంత్రి అభినందించారు. మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మోహన్‌ యాదవ్‌ కూడా ఈ వార్తపై హర్షం వ్యక్తం చేశారు. తాజా కూనలతో కలిపి దేశంలో చీతాల సంఖ్య 38కి చేరిందని కేంద్ర మంత్రి చెప్పారు. ప్రతి కూన జననం ‘ప్రాజెక్ట్‌ చీతా’ను బలపరుస్తుందని తెలిపారు. చీతాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి వాటి వృద్ధికి కృషి చేస్తున్న ఫీల్డ్‌ సిబ్బంది, వైద్యులను ఆయన అభినందించారు.

Kuno Park |

Leave a Reply